దాతలు ముందుకు రావాలి….
జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు
అనంతపురం, ఏప్రిల్ 16 ; కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం లో భాగంగా దాతలు మరింతగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పిలుపునిచ్చారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనేక మంది దాతలు ,స్వచ్ఛంద సేవా సంస్థలు, తదితరులు వివిధ రూపాల్లో ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి తమ వంతుగా సహకరిస్తున్నారన్నారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏ .ఎఫ్. ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ వై వి మల్లారెడ్డి మరియు గ్రీన్ కో గ్రూప్స్ ప్రతినిధులు అనిల్ , శ్రీనివాస రావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు శానిటేజరులు, మాస్కులు సర్జికల్ గ్లౌజ్ లను పంపిణీ నిమిత్తం జిల్లా కలెక్టర్ కు వేరువేరుగా అందజేశారు. ముఖ్యంగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ని తరిమి కొట్టాలంటే మనమందరం చేయి చేయి కలిపి కరోనా ను ఎదుర్కోవలసిన అవసరం ఉందన్నారు .ప్రజా సేవలో మేము సైతం అంటూ స్వచ్ఛంద సేవా సంస్థలు, విరాళం అందిస్తున్న దాతలు ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందని వారందరికీ కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో మరింత మంది దాతలు ఉదార భావంతో ముందుకు రావాలని కోరారు. ఈరోజు పారిశుద్ధ కార్మికుల కు ఏ ఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో సుమారు రూ.5 లక్షల వ్యయంతో మాస్కులు శాని టేజర్లు ,సర్జికల్ గ్లౌజులను అందించడం జరిగిందని మరియు గ్రీన్ కో గ్రూప్స్ తరపున సుమారు రూ. 14 లక్షల వ్యయంతో పీపీఈ కిట్స్ అందించడం పట్ల వారికి జిల్లా కలెక్టర్ తన కృతజ్ఞతలను తెలిపారు. అలాగే లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు పారిశుద్ధ్య కార్మికులను, పేద ప్రజలను ఆదుకుంటున్న వారందరికీ జిల్లా కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం శాసన సభ్యులు అనంత వెంకటరామిరెడ్డి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మురళీకృష్ణ ,జిల్లా టూరిజం శాఖ అధికారి ణి విజయలక్ష్మి, గ్రీన్ కో-గ్రూప్స్ ప్రతినిధులు శ్రీనివాస రావు ప్రాణేష్ తదితరులు పాల్గొన్నారు.