14.02.2021 ఆదివారం వేరుశనగ సెకంజరీ ప్రాసెసింగ్ యూనిటు యాక్షన్ ఫెటర్న ఏకాలజీ సెంటరు డైరక్టరు, వై.వి. మల్లా రెడ్డి గారు భూమి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్రిశాట్ తరుపున పురుషోత్తం రత్నేష్ గారు కూడ హాజరైనారు.

" భారత ప్రజలమైన మేము "

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల కేంద్రంలో ఉన్న ఎ. ఎఫ్.ఏకాలజీ సెంటర్లో " భారత ప్రజలమైన మేము "మన ప్రాథమిక హక్కులు మరియు ఉపాధి హామీ వేతనదారుల హక్కులపై సదస్సు లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మరియు డా వై.వి. మల్లా రెడ్డి, డైరెక్టరు, ఏ.ఎఫ్. ఎకాలజీ సెంటరు 12.12.2020

సమాజంలో ప్రతి మనిషి గౌరవంగా , సమానంగా  జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది .

:జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు

 అనంతపురం, డిసెంబర్ 12:

 సమాజంలో ప్రతి మనిషి గౌరవంగా , సమానంగా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. శనివారం  కళ్యాణదుర్గం మండల కేంద్రంలోని ఎ.ఎఫ్. ఎకాలజీ  సెంటర్ లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మన రాజ్యాంగాన్ని తెలుసుకుందాం ”  భారత ప్రజలమైన మేము ” అనే అంశంపై కార్యక్రమాన్ని ,ప్రాథమిక హక్కులు మరియు ఉపాధి హామీ వేతనదారుల హక్కులపై సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గంధం  చంద్రుడు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజంలో మనుషులందరూ సమానమేనని , జీవచ్ఛవంలా కాకుండా గౌరవంగా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని తెలిపారు. ఇందులో భాగంగానే నేడు ఉపాధి హామీ చట్టం అమలు అవుతున్నట్లు పేర్కొన్నారు. ఆడ ,మగ అనే భేద భావాలు లేకుండా అందరికీ సమాన  వేతనాలు అందించడం జరుగుతోందన్నారు.  ఒకే పని ఉన్నప్పుడు సమాన పనికి సమాన హక్కు ఉంటుందన్నారు . భారత రాజ్యాంగం స్ఫూర్తితో ఏర్పాటు చేసుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గ్రామీణ కుటుంబాలకు ఉపాధి పొందే హక్కు కల్పించిందన్నారు .జాబ్ కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి సంవత్సరంలో వందరోజుల  ఉపాధి కల్పించడమే కాకుండా వ్యక్తిగత మరియు గ్రామ  అవసరాలకు తగినట్లుగా పనులు చేసుకొని తద్వారా గ్రామీణ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకొనే అవకాశం కలిగించిందన్నారు.  సహజ వనరుల సంరక్షణ , పునరుద్ధరణ , చెట్ల పెంపకం మొదలగు పనుల ద్వారా సుస్థిర ఆస్తులను ఏర్పాటు చేసుకుని గ్రామాలలో  వలసల నివారణ మరియు జీవనోపాదులు మెరుగు పరచుటకు ఉపాధి హామీ చట్టం ఎంతగానో దోహదపడుతున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వాలు కూడా అన్ని రంగాలలో మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. మహిళలను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారన్నారు. రేషన్ కార్డు, ఇంటి పట్టాలు, రుణాలు మంజూరు లాంటి కార్యక్రమాల్లో మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఎస్సీ ,ఎస్టీ అనే వివక్షత ఉండకూడదన్నారు .రెండు గ్లాసుల పద్ధతులకు స్వస్తి చెప్పాలన్నారు. మూఢనమ్మకాలను  పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నం చేయాలన్నారు .ఈ సందర్భంగా 16 షోడషసూత్రాలను కలెక్టర్ సమావేశంలో వివరించారు. ముఖ్యంగా ఆనాటి పూర్వికులు అశాస్త్రీయంగా వారి లబ్దికోసం వివక్షత చూపడంతో ఆడ పిల్లల చదువులకు ఆటంకాలు, కులాంతర వివాహాలు జరుపుట మరియు  జోగిని వ్యవస్థ తదితర లాంటివి వాటికి కారణాలుగా మారాయనిజిల్లా కలెక్టర్  పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఆర్డిఓ రామ్మోహన్, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి , ఎంపీడీవో కొండన్న, ఏ.ఎఫ్., ఎకాలజీ సెంటర్, డైరెక్టర్ డా వై.వి.మల్లారెడ్డి, ఇన్చార్జి తాసిల్దార్ నాగరాజు ఉపాధి హామీ క్షేత్రస్థాయి సిబ్బంది,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Inaugural Function

Promoting Alternate / Additional Livelihoods for women from the families of Rainfed Farmers ∧ Farm labour in Anantapur district 2020-22 and beyond - 13.09.2020 at Accion Fraterna Ecology Centre, Ananthapuramu, Andhra Pradesh, India

2020

covid-19-warrior-commendation-15-aug-2020

Certificate of Commendation as Covid19 Warrior Awarded by the District Collector on Independence Day, 15.8.2020.

2019

2nd Meeting of A.P.State Agriculture Mission (AP-SAM) held by Hon’ble Chief Minister and Mission Chairman on 14-08-2019 at 4.00 pm