అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల కేంద్రంలో ఉన్న ఎ. ఎఫ్.ఏకాలజీ సెంటర్లో ” భారత ప్రజలమైన మేము “మన ప్రాథమిక హక్కులు మరియు ఉపాధి హామీ వేతనదారుల హక్కులపై సదస్సు లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మరియు డా వై.వి. మల్లా రెడ్డి, డైరెక్టరు, ఏ.ఎఫ్. ఎకాలజీ సెంటరు 12.12.2020

జిల్లాలో వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు చెరువుల పునరుద్ధరణ ఎంతో అవసరమని, ఇందుక గాను జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు మల్టీ డిసిప్లినరీ బృందాలను ఏర్పాటు చేసి సర్వే చేపట్టాలంటూ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను మరియు డా వై.వి.మల్లా రెడ్డి గారితో కలెక్టర్ గంధం చంద్రుడు మీటింగు – 06.07.2020

అనంతపురము కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా లోని చెరువుల పునరుద్ధరణ పై సంబంధిత అధికారులు, మరియు ఆర్.డి.టి ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గారు on 29.9.2020

ఏఎఫ్ ఏకాలజీ ఆధ్వర్యంలో ‘అదనపు జీవనోపాదులు’- సత్య నాదెళ్ల సతీమణి భారీ విరాళం.

జిల్లాలో మెట్ట రైతులు, రైతు కూలీల కుటుంబాల మహిళలకు ఆర్థిక స్వావలంబన, సామాజికంగా గుర్తింపు, గౌరవం పెంపొందించాలనే ఉద్దేశ్యంతో ఆర్డీటీ అదనపు జీవనోపాదుల ప్రాజెక్టు ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. ఆదివారం నగర పరిధిలోని ఆర్డీటీ ఏ.ఎఫ్.ఎకాలజి సెంటర్ లో జిల్లాలో మెట్ట రైతులు, రైతు కూలీల కుటుంబాల మహిళల కోసం అమలు కానున్న అదనపు జీవనోపాధుల ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కోసం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సతీమణి అనుపమ వి నాదెళ్ల రూ.2 కోట్ల విరాళం అందించగా అదనపు జీవనోపాధుల ప్రాజెక్టు మొదలైంది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా సమయంలో జిల్లాలో చాలా మంది జీవనోపాధి కోల్పోవడం జరిగిందని, ఇలాంటి సమయంలో జిల్లాలో మెట్ట రైతులు మరియు రైతు కూలీల కుటుంబాల మహిళలు ఆర్థిక స్వావలంబన, సాంఘిక అభివృద్ధి సాధించేందుకు అదనపు జీవనోపాదుల కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషకారమన్నారు. బిఎన్ యుగంధర్ మొదటి వర్ధంతి రోజున ఆయన కుమారుడు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సతీమణి అనుపమ వి నాదెళ్ల రూ.2 కోట్ల విరాళం అందించగా, రిటైర్డ్ ఐఏఎస్ వేణుగోపాల్ సహకారాలతో అదనపు జీవనోపాధుల ప్రాజెక్టు మొదలైందన్నారు. ఆర్డీటీ సంస్థ ను ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ స్థాపించగా ఏ.ఎఫ్.ఎకాలజి సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతోందన్నారు.

జిల్లానుంచి ఇతర రాష్ట్రాలకు, జిల్లాలకు వలస వెళ్లిన కూలీలంతా కరోనా సమయంలో వారి స్వస్థలాలకు తిరిగి వచ్చి ఇక్కడే ఉండటం జరుగుతోందని, వారందరికీ జీవన ఉపాధి కల్పించడం అత్యంత ఆవశ్యకత ఉందన్నారు. కరోనా లాంటి కష్ట పరిస్థితుల్లో జీవనోపాధి లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బందులకు గురవుతు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయని, వాటి నుంచి అందరినీ బయటికి తీసుకురావాలంటే జీవనోపాధి కార్యక్రమాలు జిల్లాలో పెద్ద ఎత్తున చేయాలన్నారు. ఇందుకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం నుంచి ఉపాధిహామీ, ఇతర జీవనోపాధి కల్పన కార్యక్రమాలు చేయడం జరుగుతోందన్నారు. పూర్తిగా అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం చేయడం సాధ్యం కాదని, ఇందుకు అనేక స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోల సహకారం చాలా అవసరమన్నారు. అందులో భాగంగా అనుపమ వి నాదెళ్ల 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయంతో మెట్ట రైతు మరియు రైతు కూలీల కుటుంబాలకు చెందిన మహిళలకు జీవనోపాదిని కల్పించేందుకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. అదనపు జీవనోపాదుల ప్రాజెక్టు జిల్లాలో ఒకటిన్నర సంవత్సరం పని చేస్తుందని, 3 వేల కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా తీసుకువెళ్లడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే మహిళలు ప్రారంభించుకున్న పలు ఉపాధి కార్యక్రమాలకు అదనపు జీవనోపాదుల ప్రాజెక్టు కింద మరికొంత సాయం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, భవిష్యత్తులో ఎక్కువ మందికి జీవనోపాధి కల్పించేలా ముందుకు వెళ్లాలన్నారు. జీవనోపాధి కల్పన కార్యక్రమాలు నిర్వహించేందుకు పలువురు దాతలు కూడా ముందుకు రావాలని కోరారు. ఇందుకు జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటామన్నారు. 25 ఏళ్ల కిందటే గ్రామీణ ప్రాంతాల్లో స్థితిగతులను పరిశీలించి మహిళలకు జీవనోపాదుల కల్పన కార్యక్రమాలను ఆర్డీటీ ప్రారంభించడం గొప్ప విషయమన్నారు.

ఈ సందర్భంగా ఆర్డీటీ ఏ.ఎఫ్.ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మెట్ట రైతులు మరియు రైతు కూలీల కుటుంబాల మహిళలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడానికి అదనపు జీవనోపాదుల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. అదనపు జీవనోపాదుల వల్ల కరువును తట్టుకునే శక్తి మహిళలకు వస్తుందని, ప్రతి కుటుంబానికి మూడు నాలుగు రకాలుగా ఆదాయ మార్గాలు ఉండాలన్నారు. మెట్ట రైతులు మరియు రైతు కూలీల కుటుంబాల మహిళలకు అదనపు జీవనోపాదుల కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అనుపమ వి నాదెళ్ల రెండు కోట్ల ఆర్థిక సహాయం అందించడం జరిగిందని, అందుకు ఇప్పటికే పొదుపు చేసుకుని సిద్ధంగా ఉన్న మరో 8 కోట్లు కలిపి మొత్తం పది కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమం మొదలవుతుందన్నారు. మహిళలకు విభిన్న ప్రోత్సాహకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వారికున్న బలాలు, అవకాశాలకు ప్రాధాన్యతనిచ్చి వారు ఎంచుకున్న వ్యాపారాలను మరింత బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు చేస్తామన్నారు. దీనిద్వారా మెట్ట రైతు, వ్యవసాయ కూలీ కుటుంబాల మహిళలకు నాయకత్వ లక్షణాలు పెరిగి ఆర్థిక స్వావలంబన, సామాజిక గుర్తింపు, గౌరవం రావడం ద్వారా వారి కుటుంబాలకు జీవనోపాదుల భద్రత కల్పించడం ఈ ప్రాజెక్టు ఆశయంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టు 2020 అక్టోబర్ నుంచి 2002 మార్చి వరకు ఒకటిన్నర సంవత్సరాల కాలవ్యవధిలో సస్య మిత్ర గ్రూపుల ఆధ్వర్యంలో మెట్ట రైతు, వ్యవసాయ కూలీ కుటుంబాలలోని మూడు వేల మంది మహిళా సభ్యులకు అదనపు జీవనోపాదులను కల్పించి వారి ఆదాయ అవకాశాలను పెంచడం జరుగుతుందన్నారు.

ఈ సందర్భంగా 12 మంది మహిళలకు చెక్కులను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. అంతకుముందు రిటైర్డ్ ఐ ఏ ఎస్ వేణుగోపాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంక్షిప్త సందేశాన్ని తెలియజేశారు.

ఈ సమావేశంలో ఆర్డీటి చైల్డ్ లైన్ డైరెక్టర్ డోరిన్ రెడ్డి, రెడ్స్ సంస్థ సి ఈ ఓ భానుజ, రిటైర్డ్ జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ గోపాల్, ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ హకీమ్ రిజ్వానా, తదితరులు పాల్గొన్నారు.

తొలి బోర్డు మీటింగ్

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా అగ్రికల్చర్ అడ్వయిజరీ బోర్డు మీటింగ్ తేది 28.08.2020, రెవెన్యూ భవన్ అనంతపురము

మన పాలన – మీ సూచనలు ప్రోగ్రామ్ – శ్రీ జగన్ మోహన్ రెడ్డి, ఛీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్, సి.యం. క్యాంప్ ఆఫీస్, అమరావతి నందు హాజరైన శ్రీ మాంచో ఫెరర్ మరియు డా వై.వి.మల్లా రెడ్డి

                                            విజయవాడ తేిదిః- 25.05.2020

International Workshop on Reversal of Desertification “Exemplary Landscape – Andhra Pradesh” held from 2nd to 6th November 2019 at AF Ecology Centre. View Press Release >>