

Press Clippings













On 21-04-2020, AF team distributed ration and face masks to 29 members(Bachelors) in Anantapur town. Originally they are belongs to Gorakhpur, Jolar districts Uttar Pradesh and Bihar States. They are wage workers (Painting, Gujari and ice cream business), they don’t have Govt. ration card. Due to lockdown they are unable to work outside. AF provided 1 month Ration kit (Rice, Wheat, Dal, Oil, sugar, salt, soaps etc ) to them. Mr. Murali Krishna and Mr. Shaiksha Vali, AF team members has been participated in this distribution process


















AF team reached to the Tea stall seller’s ( 4 Bachelors) who migrated from Jalor, Rajasthan and staying here at Kadiri Road, Dharmavaram Mandal.
Assessed their need in presence of central team member then delivered Ration and other necessary logistics, which can be utilise for more than 3 weeks.
Also distributed the masks to each one besides make them aware about the Preventive ways to curb the spread of Pendemic Carona

ఈరోజు కూడేరు నందు ఉన్న రాజస్థాన్ ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చి జిలేబి వ్యాపారం జ్యూస్ వ్యాపారం రాజస్థాన్ టీ స్టాల్ పెట్టుకున్న వారికి మొత్తం 14 మందికి kovid 19 ఉండడంవల్ల షాపులు బంద్ చేయడం జరిగింది కావున వారికి ఉపాధి లేక తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి AF ఎకాలజీ సెంటర్ అనంతపురం సమస్త వారు వీరికి కనీస అవసరాలు బియ్యం గోధుమపిండి చక్కెర పసుపు సోప్ ను అందించడం జరిగింది ఇందుకు వీరు AF ecology డైరెక్టర్ అయినా వై.వి మల్లారెడ్డి సార్ గారికి ధన్యవాదములు తెలియజేయడం జరిగింది అలాగే సుజాత మేడం గారు లక్ష్మణ మూర్తి (APDMP ) nanjireddy ఎం ఎస్ ఎం ఎస్ లీడర్ పెద్దక్క వీరికి కరోనా రాకుండా మాస్కులు అందించి తగు జాగ్రత్తలు తెలియజేయడం జరిగింది.
దాతలు ముందుకు రావాలి….
జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు
అనంతపురం, ఏప్రిల్ 16 ; కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం లో భాగంగా దాతలు మరింతగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పిలుపునిచ్చారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనేక మంది దాతలు ,స్వచ్ఛంద సేవా సంస్థలు, తదితరులు వివిధ రూపాల్లో ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి తమ వంతుగా సహకరిస్తున్నారన్నారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏ .ఎఫ్. ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ వై వి మల్లారెడ్డి మరియు గ్రీన్ కో గ్రూప్స్ ప్రతినిధులు అనిల్ , శ్రీనివాస రావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు శానిటేజరులు, మాస్కులు సర్జికల్ గ్లౌజ్ లను పంపిణీ నిమిత్తం జిల్లా కలెక్టర్ కు వేరువేరుగా అందజేశారు. ముఖ్యంగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ని తరిమి కొట్టాలంటే మనమందరం చేయి చేయి కలిపి కరోనా ను ఎదుర్కోవలసిన అవసరం ఉందన్నారు .ప్రజా సేవలో మేము సైతం అంటూ స్వచ్ఛంద సేవా సంస్థలు, విరాళం అందిస్తున్న దాతలు ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందని వారందరికీ కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో మరింత మంది దాతలు ఉదార భావంతో ముందుకు రావాలని కోరారు. ఈరోజు పారిశుద్ధ కార్మికుల కు ఏ ఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో సుమారు రూ.5 లక్షల వ్యయంతో మాస్కులు శాని టేజర్లు ,సర్జికల్ గ్లౌజులను అందించడం జరిగిందని మరియు గ్రీన్ కో గ్రూప్స్ తరపున సుమారు రూ. 14 లక్షల వ్యయంతో పీపీఈ కిట్స్ అందించడం పట్ల వారికి జిల్లా కలెక్టర్ తన కృతజ్ఞతలను తెలిపారు. అలాగే లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు పారిశుద్ధ్య కార్మికులను, పేద ప్రజలను ఆదుకుంటున్న వారందరికీ జిల్లా కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం శాసన సభ్యులు అనంత వెంకటరామిరెడ్డి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మురళీకృష్ణ ,జిల్లా టూరిజం శాఖ అధికారి ణి విజయలక్ష్మి, గ్రీన్ కో-గ్రూప్స్ ప్రతినిధులు శ్రీనివాస రావు ప్రాణేష్ తదితరులు పాల్గొన్నారు.